కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తెలంగాణ స్టేట్ అత్యపత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అత్యపత్య జూనియర్ ఛాంపియన్‌షిప్ పోటీలు (Atya Patya Athletics Championships) ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 19 జిల్లాల నుంచి 518 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలుర విభాగంలో హైదరాబాద్ ప్రథమ, రంగారెడ్డి ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
బాలికల విభాగంలో నాగర్ కర్నూల్ ప్రథమ, నిర్మల్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ముగింపు కార్యక్రమానికి ఎన్నారై చంద్రశేఖర్, ఎస్టీయూటీఎస్ జిల్లా కార్యదర్శి జే. లక్ష్మణ్ హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్యపత్య అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వన్నెల భూమన్న, కార్యదర్శి సంజీవ్, అసోసియేట్ కార్యదర్శి ముఖేష్, జాయింట్ సెక్రటరీ హన్మాండ్లు, వివిధ జిల్లాల కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.

