ప్రశ్నించడం విద్యార్థుల రాజ్యాంగ హక్కు: ఉజ్జల్ భుయాన్

కలం, వెబ్ డెస్క్: ప్రశ్నించడం విద్యార్థులకు రాజ్యాంగమే ఇచ్చిన హక్కు అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan) స్పష్టం చేశారు. అలా ప్రశ్నించినవారిపై కఠిన చర్యలు తీసుకోవడమంటేనే అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యతిరేక చర్యనే అవుతుందని తేల్చి చెప్పారు. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతి సాధారణమని, ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. స్వేచ్ఛాయుత సమాజంలో అదొక ముఖ్యమైన అంశంగా పరిగణించాలన్నారు.

విమర్శలు వివాదంగా మారొద్దు..

యూనివర్సిటీలు అంటేనే విభిన్న ఆలోచనలకు నిలయాలని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభివర్ణించారు. ‘ఎంతో మంది విద్యార్థులు వారి వారి ఆలోచనలు పంచుకుంటుంటారు. కొన్ని సార్లు వాటితో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. తిరిగి ప్రశ్నలు అడగొచ్చు. తీవ్రంగా విమర్శించే అవకాశం కూడా ఉంటుంది. అంతమాత్రాన చర్యలు తీసుకుంటే మాత్రం సరికాదు. విమర్శలు ఎప్పుడూ అర్థవంతమైన చర్చగా ఉండాలి తప్ప వివాదానికి దారి తీయొద్దు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. అయితే అది యూనివర్సిటీల నుంచే ప్రారంభం కావాలి’ అని సూచించారు. ఇటీవల ఢిల్లీ ఆందోళనల్లో విద్యార్థులపై పోలీసులు కఠిన వైఖరి ప్రదర్శించారనే విమర్శలు వస్తున్న వేళ జస్టిస్ భుయాన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>