చిరంజీవితో బుచ్చిబాబు మూవీ.. క్రేజీ కాంబో రెడీ!

కలం, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బుచ్చిబాబు సానా కాంబోలో మూవీ సెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నెరేషన్ బుచ్చిబాబు ఇవ్వగా.. చిరంజీవి ఎంతో ఇంప్రెస్ అయినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందట.

బుచ్చిబాబు రామ్ చరణ్‌తో ‘పెద్ది’ మూవీ తీయగా.. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బుచ్చిబాబు మేకింగ్‌ను చిరంజీవి ఎంతో మెచ్చుకున్నారు. దీంతోనే ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే.. బుచ్చిబాబు తన మూడు సినిమాలను మెగా కాంపౌండ్‌లోనే చేసినట్లవుతుంది. తన మొదటి సినిమా ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేసి.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు.

శ్రీకాంత్ ఓదెలతో మూవీ ఉంటుందా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కాకా మూవీలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు ఎప్పటినుంచో చేస్తూ వస్తున్న విశ్వంభర షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత చిరంజీవి నటించబోయేది శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే అని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సినిమాను ప్రకటించేశారు. అయితే ఇటీవల ది ప్యారడైజ్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెలతో మూవీ చేస్తారా..? లేకపోతే బుచ్చిబాబు మూవీని పట్టాలెక్కిస్తారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>