కలం, జోగుళాంబ గద్వాల: బీసీ రాజ్యాధికారం పాదయాత్రలో భాగంగా గద్వాలకు వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఆదివారం నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం (NTSF), TTU ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూల్ ప్రైవేటు ఆసుపత్రులలో నడిగడ్డ ప్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సౌకర్యం కల్పించి మెరుగైన వైద్యం అందేలా శాసనమండలి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు పాల్వాయి లక్ష్మీనారాయణ, TTU జిల్లా అధ్యక్షులు బుచ్చన్న, NTSF ప్రధాన కార్యదర్శి కొండాపురం ప్రతాప్, రాజు సాగర్, నర్సింహుల గౌడ్, నర్సింహులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

