యెన్నం నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధి: లక్ష్మణ్ యాదవ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ (Laxman Yadav) అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పధకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెలే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) నాయకత్వంలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో దాదాపు 3700 మందికి పింఛన్లు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈనెల 19న ఇందిరాగాంధీ జయంతి రోజు ప్రతి మహిళకు రూ. 5 లక్షల బీమా పధకాన్ని వర్తింపజేసే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ సిరాజ్ ఖాద్రీ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం రూ.220 కోట్లు, అండర్ డ్రైనేజీ కోసం రూ.603 కోట్లు నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ఫోటోలకు మాత్రం ప్రాధాన్యత మిచ్చారని ఆరోపించారు.

మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వ తొమ్మిదేళ్ల అభివృద్ధిపై, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల నుంచి చేస్తున్న అభివృద్ధిపై డిబేట్ కు సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో మీడియాసెల్ కన్వీనర్ సిజే బెనహర్, నాయకులు ఆజ్మత్ అలీ, రాములుయాదవ్, నాగరాజు, మల్లేష్, మురళీ, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>