Mobile Popup Ad
Mobile Popup Ad

డివైన్ వార్ టచ్‌తో ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీ పోస్టర్ వైరల్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (NTRIVIKRAM) కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మాసివ్ కాంబో మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో కనిపించే త్రిశూలం, దానిలోనుంచి వెలువడుతున్న డిఎన్ఎ హెలిక్స్ ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అలాగే  “One Spear. One Purpose. One Divine Reckoning” అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో సంస్కృత శ్లోకం కూడా ఉండటంతో ఈ చిత్రం పురాణ, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా, హారిక & హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>