పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన టీం

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Jr NTR).. పాలిటిక్స్ లోకి వస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఓ లేఖను రిలీజ్ చేసింది. జులై 18న నిర్వహించనున్న ‘ఊరు-వాడ’ కార్యక్రమానికి, ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని.. అసత్య ప్రచారాలను నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్నిప్రచారం చేయవద్దని మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేసింది. దీని వల్ల అభిమానులు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారని లేఖలో రాసుకొచ్చింది.

తమిళనాడులో హీరో విజయ్ సొంత పార్టీని స్థాపించి, వ్యూహాత్మకంగా అడుగులు వేసి అసెంబ్లీ ఎన్నికలల్లో అనూహ్య ఫలితాలలో ఘన విజయం సాధించి అధికారం పీఠం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ట్రెండ్ ను పలువురు సినీ తారలు అనుసరిస్తున్నారని.. ఈ తరహాలోనే ఏపీలో సైతం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.

కొత్త పార్టీ ప్రకటించడం, లేక పొలిటికల్ ఎంట్రీ డిసైడ్ అయిందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జూలై 18న తారక్ తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చి, సేవా కార్యక్రమాల పేరుతో రాజకీయ పార్టీ ప్రకటన లేదా పొలిటికల్ రోడ్‌మ్యాప్‌ రిలీజ్ చేస్తారని ఊహాగానాలు పెద్దఎత్తున వినిపించాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఎన్టీఆర్ పిఆర్ టీమ్, ఫ్యాన్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చాయి. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశాయి.

Read Also: రాపిడో రైడర్‌ను నడిరోడ్డుపై వేధించిన మహిళ.. వీడియో వైరల్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>