epaper
Sunday, February 22, 2026
epaper

దేశంలో ఉగ్రకుట్ర భగ్నం: ముష్కరుల అరెస్ట్

కలం, వెబ్​ డెస్క్​ : దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వెలిసిన ఫ్రీ కాశ్మీర్ పోస్టర్లు (Free Kashmir Posters) దేశవ్యాప్త కలకలానికి దారితీశాయి. ఈ ఉదంతం వెనుక ఉన్న లోతైన కుట్రను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. సామాజిక మాధ్యమాల వేదికగా పాకిస్థాన్ అనుబంధ ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలుపుతూ, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను తమిళనాడు (Tamil Nadu)లో అరెస్ట్ చేశారు. మిజానుర్ రెహమాన్, మహమ్మద్ షాబాత్, ఉమర్, మహమ్మద్ లిటన్, మహమ్మద్ షాహిద్, మహమ్మద్ ఉజ్జల్ అనే ఈ ఆరుగురు వ్యక్తులు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి, నకిలీ ఆధార్ కార్డులతో గార్మెంట్ పరిశ్రమలో కార్మికులుగా చలామణి అవుతున్నట్లు విచారణలో తేలింది.

తమిళనాడు (Tamil Nadu)లోని ఊతుకుళి, పల్లడం, తిరుమురుగన్‌పూండి ప్రాంతాల్లో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులకు సహకరిస్తూ, దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రణాళికలు వేస్తున్న ఈ ముఠాను ప్రస్తుతం రైలు మార్గంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర సూత్రధారుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also: మావోయిస్టు పార్టీకి భారీ షాక్​: అగ్రనేతలు లొంగుబాటు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>