కలం, వెబ్ డెస్క్ : నార్త్ సైప్రస్ తీరంలో ఘోర ప్రమాదం (North Cyprus Boat Accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బోట్ ఒక్కసారిగా బోల్తా పడటంతో ఆరుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో బోట్‌లో దాదాపు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంతర్జాతీయ కథనాల ద్వారా తెలుస్తోంది.
సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 172 మందికిపైగా ప్రయాణికులను రక్షించినట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : తెలంగాణలో 1000 రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Youtube

