కలం, ఖమ్మం బ్యూరో: నగరంలోని బర్మా షెల్ రోడ్డులో ఆదివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. ఆచూకీ తెలియని ఈ మృతదేహం వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఖమ్మం (Khammam) త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని, అతడు నీలం రంగు షర్టు, లుంగీ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అనంతరం సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసినవారు, లేదంటే అతడిని గుర్తించగలిగిన వారు ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 8712659116, సీఐ ఫోన్ నంబర్ 8712659115 కు గానీ, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు గానీ సమాచారం అందించాలని అధికారులు కోరారు.

