Mobile Popup Ad
Mobile Popup Ad

నోరా ఫతేహీతో ఫిఫా వరల్డ్ కప్‌కు ఓపెనింగ్.. ఖాళీ సీట్లపై చర్చ

క‌లం, వెబ్ డెస్క్: కెనడాలో తొలి ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) ఘనంగా ప్రారంభమైంది. టొరంటోలో జరిగిన ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి (Nora Fatehi) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె అధికారిక వరల్డ్ కప్ పాట ‘సీర్ సీర్’కు ప్రదర్శన ఇచ్చింది. వెజీడ్రీమ్, సంజోయ్, జెస్సీ రేయేజ్, అలెసియా కారా, ఎలియాన్నా కూడా ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత సహ-ఆతిథ్య దేశం కెనడా, బోస్నియా అండ్ హెర్జెగోవినా మధ్య గ్రూప్-బి మ్యాచ్ ప్రారంభమైంది. ఇటలీని ఓడించి టోర్నీకి అర్హత సాధించిన బోస్నియా జట్టుపై కూడా అందరి దృష్టి నిలిచింది.

అయితే టోర్నీ ప్రారంభంతో పాటు మరో అంశం చర్చనీయాంశమైంది. టొరంటో స్టేడియంలో కొన్ని సీట్లు ఖాళీగా కనిపించగా, గ్వాడలహారాలో జరిగిన దక్షిణ కొరియా-చెకియా మ్యాచ్‌లో కూడా ఖాళీ సీట్లు కనిపించాయని అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తావించారు. టోర్నీ (FIFA World Cup) ప్రారంభానికి ముందు వేల సంఖ్యలో టికెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి. అయితే గ్వాడలహారా స్టేడియం ఖాళీగా లేదని ఫిఫా స్పష్టం చేసింది.

సీట్లలో కనిపించిన దృశ్యాల కంటే, స్కాన్ చేసిన టికెట్లు, స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల ఆధారంగానే హాజరు లెక్కిస్తామని పేర్కొంది. మ్యాచ్ సమయంలో కొందరు అభిమానులు తమ సీట్లలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నిలబడి ఉన్నారని కూడా వివరించింది.

Read Also: రాజ్య‌స‌భ‌లో బ‌లం కోస‌మే బీజేపీ కుట్ర‌: టీపీసీసీ చీఫ్ మ‌హేశ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>