Mobile Popup Ad
Mobile Popup Ad

జాహ్నవి మిస్సింగ్ కేసులో ట్విస్ట్..పెంపుడు కుక్క మృతి

కలం, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు (Jahnavi Missing Case ) లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పాప అచూకీకి కీలకమైన పెంపుడు కుక్క అనుహ్యంగా మృతి చెందింది. అంతకుముందు ఆ కుక్క ద్వారా పాప ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి అడవిలోకి వదిలారు. గాలింపులో భాగంగా కుక్క 80 నిమిషాల్లో 8 కిలోమీటర్లు సంచరించింది. పలు ప్రాంతాల్లో తిరిగి ఇంటికి చేరింది. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో కుక్క ఒక్కసారిగా కుప్పకూలి మరణించింది.

ఈ నెల 6న చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి అదృశ్యమైన పెంపుడు కుక్క మూడు రోజుల తర్వాత మళ్లీ ఇంటికి వచ్చింది. దీంతో జాహ్నవి మిస్సింగ్ కేసులో (Jahnavi Missing Case) కుక్క కీలకంగా మారుతుందని పోలీసులు భావించారు. దీంతో దాని మెడకు జీపీఎస్ అమర్చి గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అనుహ్యంగా కుక్క చనిపోయింది. కుక్క మృతితో దర్యాప్తునకు సంబంధించిన కీలక ఆధారాన్ని పోలీసులు కోల్పోయారు. చిన్నారి జాహ్నవి ఆచూకీని కనుగొనడం పోలీసులకు ఇప్పుడు సవాలుగా మారింది.

Read Also: ఆరోగ్య శ్రీ క్రెడిట్ వైఎస్ఆర్‌దే.. కానీ..: మంత్రి స‌త్య‌కుమార్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>