కేంద్రం నోటీసులపై ఇమ్రాన్ ఖాన్‌ అభ్యంతరం

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ (Actor Imran Khan) తన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు రిప్లై ఇచ్చారు. కార్డును ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో చెప్పాలని కోరారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం, తనపై చర్యలు తీసుకునేముందు వాదనలు సమర్థవంతంగా వినిపించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. అంతేగాకుండా కార్డు రిజిస్ట్రేషన్ రద్దుకు పోలీసులు పేర్కొన్న కారణాలు కూడా క్లారిటీగా లేవన్నారు. తనపై చర్యలు తీసుకోవడానికి ఉపయోగించిన పత్రాలు, ఆధారాలను అందించాలని ముంబై పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో కేంద్రం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటనేది ఆసక్తికరంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే..

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు అమెరికా పౌరుడు. ఆయనకు భారతీయ మూలాలు ఉండటంతో నిబంధనల ప్రకారం గతంలోనే ఓసీఐ కార్డు జారీ చేశారు. అయితే, ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య ఫిర్యాదు చేశారు. స్పందించిన ముంబైలోని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం ఇమ్రాన్ ఖాన్ ఓసీఐ కార్డు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని 15 రోజుల్లో చెప్పాలని నోటీసు జారీ చేసింది. ఇమ్రిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినందుకు అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని మరో నోటీసులో ఆదేశించింది. దీనిపై ఆయన బాంబే హై కోర్టును ఆశ్రయించగా.. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ విచారణను నవంబర్ రెండో తేదీకి వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>