కలం, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంటల్ మాధవ్ (Gorantla Madhav) కు పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తన మీద నమోదైన పోక్సో కేసు విచారణకు మాధవ్ హాజరు కావట్లేదని కోర్టు ఇలా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో అత్యాచారానికి గురైన ఓ బాలిక విషయాలను గోరంట్ల మాధవ్ బయటకు చెప్పారని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) ఫిర్యాదు చేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణకు రావాలంటూ కోర్టు పలుమార్లు నోటీసులిచ్చినా మాధవ్ రాకపోవడంతో కోర్టు ఈ విధంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీ కాల్ చేయాలని కోరుతూ సోమవారం కోర్టులో మాధవ్ పిటిషన్ వేయనున్నట్టు ఆయన వర్గం చెబుతోంది.
Read Also: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా వర్సిటీలు వెలవెల
Follow Us On: Sharechat


