Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యుత్‌లో తెలంగాణ సరికొత్త రికార్డు.. 18 వేల మెగావాట్లు దాటేసింది!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మరోసారి తిరుగులేని ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక డిమాండ్ (Power Demand) అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన అధికారులు, సిబ్బందికి భట్టి అభినందనలు తెలిపారు.

ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనం అని ప్రకటనలో పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను అధిగమించే స్థాయికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోంది అన్నారు.

జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభ

18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో తెలంగాణ సుమారు 19,900 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను నమోదు చేసిన మధ్య ప్రదేశ్, అలాగే 19,600–20,600 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదైన రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు సమానంగా నిలిచింది అన్నారు. భూభాగం, జనాభా పరంగా చిన్నదైనా తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటింది అన్నారు. అదేవిధంగా పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్‌ను తెలంగాణ నమోదు చేసిందని తెలిపారు. భౌగోళికంగా చిన్నదైనా, అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఐటీ, ఔషధ తయారీ, తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణం అని డిప్యూటీ సీఎం వివరించారు.

డిమాండ్ పెరుగుదల

2023-24: గరిష్ట డిమాండ్15,623 మెగావాట్లు (08.03.2024)
2024–25 గరిష్ట డిమాండ్: 17,162 మెగావాట్లు(20.03.2025)
2025–26 (మునుపటి గరిష్టం): 17,162 మెగావాట్లు
2026 (ప్రస్తుతం): 18,139 మెగావాట్లు (03.03.2026)

భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా తెలంగాణ

“తెలంగాణ కేవలం సమకాలీన అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, రాబోయే వేసవి గరిష్ట డిమాండ్‌లకు ముందస్తు ప్రణాళికలతో పూర్తిగా సిద్ధంగా ఉంది. బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందుచూపు ప్రణాళిక, సమన్వయంతో ఉన్న వ్యవస్థ మన బలం.” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.

Read Also: సీనియర్ జర్నలిస్ట్ మూర్తి సస్పెండ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>