epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

రఫ్ఫాడించిన రాధా, రిచా.. ఆర్​సీబీ హ్యాట్రిక్​

కలం, వెబ్​డెస్క్​: ఆల్​రౌండర్​ రాధా యాదవ్ (Radha Yadav) హాఫ్ ​సెంచరీ ​(​66; 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్​లు)తో, రిచా ఘోష్​ (44 ; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్​లు), నదిన్​ డి క్లెర్క్​(26; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్​లు) ధనాధన్​ ఆటతో రఫ్ఫాడించడంతో ఆర్​సీబీ హ్యాట్రిక్​ విక్టరీ కొట్టింది. మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా శుక్రవారం నవీ ముంబైలోని డీవై పాటిల్​ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో ఆర్​సీబీ 32 పరుగుల తేడాతో గుజరాత్​ జెయింట్స్​ జట్టుపై గెలుపొందింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన రాయల్​ ఛాలెంజర్స్​ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్​ బౌలర్లలో సోఫీ డివైన్​ 3, కష్వీ గౌతమ్ 2 వికెట్లు, రేణుకా సింగ్ ఠాకూర్​, జార్జియా వేర్​హామ్​ చెరో వికెట్​ తీశారు.

ఛేదనలో జెయింట్స్​ ) 18.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. భారతి ఫుల్మాలి(39; 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్​లు) టాప్​ స్కోరర్​. బెత్​ మూనీ(27), తనూజ కన్వర్​(21) ఓ మోస్తరు పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్​ 5 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీసింది. లారెన్​ బెల్​ 3 వికెట్లు తీయగా, అరుంధతి రెడ్డి, నదిన్​ డి క్లెర్క్​ చెరో వికెట్​ పడగొట్టారు. రాధా యాదవ్​ (Radha Yadav) కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

Read Also: జడేజా ‘విశ్వ’రూపం.. విజయ్​ హజారే ఫైనల్​కు సౌరాష్ట్ర

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>