జోగి ర‌మేష్‌పై నాన్ బెయిల‌బుల్ కేసు!

క‌లం, వెబ్ డెస్క్‌: వైసీపీ నాయ‌కుడు జోగి ర‌మేష్‌(Jogi Ramesh)పై మ‌రో కేసు న‌మోదైంది. శుక్ర‌వారం వైఎస్ జ‌గ‌న్ ఇబ్ర‌హీంప‌ట్నం(Ibrahimpatnam) ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జ‌న‌ స‌మీక‌ర‌ణ చేయ‌వ‌ద్ద‌ని పోలీసులు జోగి ర‌మేష్‌కు ముందుగానే సూచించారు. ఈ మేర‌కు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే జోగి ర‌మేష్ పోలీసుల ఆదేశాల‌ను బేఖాత‌రు చేశార‌ని పోలీసులు ఆరోపిస్తున్నారు. బైక్ ర్యాలీలు, జ‌న స‌మీక‌ర‌ణ చేసి త‌మ విధుల‌కు ఆటంకం క‌లిగించార‌ని పేర్కొంటూ ఎస్సై ర‌వి వ‌ర్మ ఇబ్ర‌హీంప‌ట్నంలో జోగి ర‌మేష్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నాన్ బెయిల‌బుల్ కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ఇటీవ‌ల మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జోగి ర‌మేష్‌పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>