కలం, వలిగొండ: తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద మండలాలలో ఒకటైన వలిగొండ (Valigonda) మండలానికి సర్వేయర్ లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వలిగొండ మండలంలో 37 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రతిరోజు పదుల సంఖ్యలో సర్వేయర్‌తో అవసరం ఏర్పడుతుంది. అయితే వలిగొండ సర్వేయర్ దాదాపు నెల రోజుల క్రితం ప్రమోషన్ పై వెళ్లగా, ఆ పోస్ట్ ఖాళీ అయింది.
నిత్యం రైతులు సర్వేయర్ కోసం వివిధ గ్రామాల నుండి ఎన్నో ఇబ్బందులు పడి, తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారు. కొత్త సర్వేయర్ వచ్చాడా లేదా అని తెలుసుకొని ఉసురుమంటూ తిరిగి వెళుతూ కనిపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే వలిగొండ మండలానికి సర్వేయర్ ను నియమించాలని రైతులు కోరుతున్నారు.

