రాష్ట్రంలో రెండు ‘పవర్ సెంటర్లు’ కుదరదు : స్టాలిన్

కలం డెస్క్ : ఎన్నికైన ప్రభుత్వాలు రూపొందించే బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్(MK Stalin) తనదైన శైలిలో స్పందించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే ‘సుప్రీం’ అని నొక్కిచెప్పారు. డ్రైవర్ సీట్‌లో ఉండాల్సింది ప్రభుత్వాలేనని, ఏకకాలంలో రాష్ట్రంలో రెండు పవర్ సెంటర్లు సాధ్యం కాదన్నారు. రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న వ్యవస్థలే రాజ్యాంగాన్ని, దాని స్ఫూర్తిని ఉల్లంఘిస్తే రాజ్యాంగానికి లోబడి ఏర్పడిన న్యాయస్థానాలే ఉపశమనంగా ఉంటాయన్నారు. కోర్టుల తలుపులు ఎప్పటికీ మూసివేయరాదన్నారు. ప్రభుత్వాలు రూపొందించే బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపే విషయంలో సుప్రీంకోర్టు(Supreme Court) తాజాగా కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీచేసి నాల్గవ ఆప్షన్‌కు అవకాశం లేదని స్పష్టం చేసిన విషయాన్ని స్టాలిన్ గుర్తుచేశారు. రాష్ట్రాల హక్కుల సాధన కోసం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోడానికి న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఇందుకోసం రాజ్యాంగంలోని ప్రతీ అవకాశాన్ని వాడుకుంటామన్నారు.

నిర్దిష్ట గడువు ఉండి తీరాల్సిందే :

ఎన్నికైన ప్రభుత్వాలు రూపొందించే బిల్లులకు చట్టబద్ధత లభించేందుకు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం అనివార్యమైనందున దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం వాటిపై స్పష్టత ఇవ్వాల్సిందేనని, ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించి నిర్దిష్ట గడువును నిర్దేశించేలా చూస్తామని, అప్పటివరకు విశ్రాంతి ఉండదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్టాలిన్(MK Stalin) గుర్తుచేశారు. రాజ్‌భవన్‌కు వచ్చిన బిల్లులను ఆమోదించడం లేదా రాష్ట్రపతికి పంపడం లేదా తిరస్కరించి తిరిగి అసెంబ్లీకి పంపడం మినహా నాల్గవ ఆప్షన్ లేదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, గవర్నర్‌కు ఉన్న ‘పాకెట్ వీటో’ అధికారాన్ని తిరస్కరించాలన్న అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

గవర్నర్లు దీర్ఘకాలం పాటు బిల్లులను ఆమోదం తెలపకుండా ఉంచుకునే వీలు లేకుండా సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడం మంచి పరిణామమన్నారు. బిల్లుల ఆమోదంలో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి సుప్రీంకోర్టు తలుపు తట్టేలా వెసులుబాటు కల్పించడంతో గవర్నర్‌లను జవాబుదారీ చేయడానికి వీలుంటుందన్నారు. తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వులు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పుపై ప్రభావం చూపదన్నారు. సహకార సమాఖ్య విధానం అమలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం తదితరాలపై పోరాడుతూనే ఉంటామన్నారు.

Read Also: మిస్ యూనివర్స్- 2025గా ఫాతిమా బాష్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>