కొత్తకోట ‘నో ఫ్లయింగ్ జోన్’

కలం, వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కొత్తకోట (Kothakota) పర్యటన నేపథ్యంలో పట్టణాన్ని తాత్కాలికంగా ‘నో ఫ్లయింగ్ జోన్’ గా ప్రకటించినట్లు జిల్లా ఎస్పీ సునితారెడ్డి తెలిపారు. అత్యున్నత భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు జూలై 15న కొత్తకోట పట్టణ పరిధిలో డ్రోన్లు, కెమెరా డ్రోన్లు, బెలూన్లు, పారామోటార్లు, రిమోట్ కంట్రోల్‌తో ఎగిరే పరికరాలు, ఇతర మానవరహిత వైమానిక పరికరాలను సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వినియోగించడం పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు.

ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా డ్రోన్లు లేదా ఇతర ఎగిరే పరికరాలను వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>