నిజామాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్​..

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధి దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని, కమ్మలు (Chain Snatching) అపహరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలాన్ని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.

అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ, ఘటన (Chain Snatching) జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను వెంటనే పరిశీలించాలని, నిందితులను గుర్తించి అత్యంత వేగంగా అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని, నేరస్తుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించాలని కమిషనర్ సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read Also: వాతావరణంలో పెనుమార్పు.. ఆందోళనలో దక్షిణాది రైతులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>