యాదగిరిగుట్టలో నేడు దర్శన వేళల్లో మార్పులు

కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి (Yadagirigutta ) ఆలయంలో నేడు జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ, భద్రతా కారణ దృష్ట్యా ఆలయ దర్శన వేళలతో పాటు, నిత్య కైంకర్యాల సమయాల్లో పలు మార్పులు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ప్రకటించిన నూతన సమయాలను ప్రకటించారు.

ప్రమాణ స్వీకారోత్సవం కారణంగా శనివారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు స్వామివారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనాల సమయాన్ని ఉదయం 9 గంటల నుండి 9:30 గంటల వరకు కేటాయించారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు సుదర్శన నరసింహ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణాన్ని ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరిపించనున్నారు.

కొండపైకి వాహనాల రాకపోకలపై ఆంక్షలు

ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు కొండపైకి ఎలాంటి ప్రైవేటు వాహనాలను గానీ, ఇతర ఇతర వాహనాలను గానీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>