యూజీడీ పనులపై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా సమీక్ష

కలం, నిజామాబాద్ బ్యూరో :  నిజామాబాద్ (Nizamabad) నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ (UGD Connection) పనుల్లో వేగం పెంచాలని ఇందూరు అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) డిమాండ్ చేశారు. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్‌లో గురువారం యూజీడీ అనుసంధాన పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన ప్రాంతాల్లో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. నగరవాసులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పనులు నాణ్యతతో చేపట్టాలని, భవిష్యత్తులో ఇంటి యజమానులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సక్రమంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, పనుల వేగం పెంచేందుకు మరిన్ని బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇపకాయల సుమిత్రా కిషోర్, మఠం పవన్, చింతకాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: లోక్ సభలో వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>