బిల్లు మారుస్తాం.. విప‌క్షాల‌కు అమిత్ షా స‌వాల్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన బిల్లుల‌పై ప్ర‌తిప‌క్షాలకు స‌మాధాన‌మిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డీలిమిటేష‌న్‌ (Delimitation)పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని, దేశంలో ఉత్త‌రాదికి, ద‌క్షిణాదికి స‌మాన అధికారాలు ఉంటాయ‌ని అమిత్ షా స్ప‌ష్టం చేశారు. దేశంలో విభ‌జ‌న రాజ‌కీయాల‌కు, ప్రాంతీయ విబేధాల‌కు చోటు లేద‌ని స్ప‌ష్టం చేశారు. డీ లిమిటేష‌న్‌లో సీట్ల పెంపు 50 శాతం త‌గ్గ‌కుండా బిల్లులో మార్పులు చేసి ప్ర‌వేశ పెడ‌తామ‌ని, దీన్ని ఆమోదించేందుకు ప్ర‌తిప‌క్షాలు సిద్దంగా ఉన్నాయా? అని అమిత్ స‌వాల్ విసిరారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు బిల్లును వ్య‌తిరేకించిన ప్ర‌తిప‌క్షాల‌ను ఒక్క‌సారిగా ఇరుకున ప‌డేసిన‌ట్ల‌య్యింది.

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై అఖిలేశ్ యాద‌వ్ స్పందించారు. ఈ స‌వాల్‌ను స్వీక‌రిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అయితే బీజేపీపై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని, తాము రాత‌పూర్వ‌కంగా హామీ ఇచ్చినా న‌మ్మే ఛాన్స్ లేద‌ని వ్యాఖ్యానించారు. అమిత్ షా (Amit Shah) వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ కాంగ్రెస్ స‌భ్యుడు కేసీ వేణు గోపాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డీలిమిటేష‌న్‌లో రాష్ట్రాల‌కు ఉన్న రాజ్యాంగ ర‌క్ష‌ణ కొన‌సాగించాల‌ని, రాజ్యాంగ బ‌ద్ధంగానే సీట్ల పెంపు ఉంటుంద‌ని రాసివ్వాల‌ని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బిల్లులో ఈ అంశాన్ని స్ప‌ష్టంగా పొందుప‌ర్చాల‌ని చెప్పారు. మరికొద్ది సేపట్లో బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read Also: ఏజెన్సీల ఇష్టారాజ్యం.. ఔట్ సోర్సింగ్ దందాకు అడ్డేదీ..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>