దమ్మపేటలో డిపిఓ తనిఖీలు… కార్మికులకు కీలక సూచనలు!

కలం, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) కే.అనుష దమ్మపేట (Dammapeta) మండలంలో చేసిన ఆకస్మిక తనిఖీల్లో పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి, వారి భద్రతకు పెద్దపీట వేశారు. శుక్రవారం మండల పరిధిలోని అంకంపాలెం, దమ్మపేట పంచాయతీ కార్యాలయాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా దమ్మపేట మేజర్ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ కార్మికులను నేరుగా పిలిచి, ప్రతి నెలా జీతభత్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.

నూతన పంచాయతీ పాలకవర్గం ఏర్పాటు అనంతరం తమకు ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందుతున్నాయని కార్మికులు సమాధానమిచ్చారు. అనంతరం డిపిఓ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా రక్షణ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు, హ్యాండ్ గ్లౌసులు, బూట్లు ధరించాలని కీలక సూచనలు చేశారు.

తనిఖీల్లో భాగంగా పంచాయతీ రికార్డులను నిశితంగా పరిశీలించిన డిపిఓ అనుష.. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, వివిధ కొనుగోళ్ల వివరాలను పంచాయతీ కార్యదర్శి బండి అనంత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ​ఇటీవల నిర్వహించిన ప్రత్యేక, సాధారణ గ్రామసభల్లో స్థానిక ప్రజలు ప్రధానంగా ఏ సమస్యలను లేవనెత్తారని ప్రశ్నించగా.. గ్రామాల్లో డ్రైనేజీల నిర్మాణాన్ని ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారని సర్పంచ్ రమాదేవి డిపిఓ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై డిపిఓ స్పందిస్తూ.. సీసీ రోడ్ల వెంబడి నూతన డ్రైనేజీల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా, గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>