లోక్ సభలో వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు

కలం, నేషనల్ డెస్క్ :  చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు (Women Reservation Bill) లోక్‌సభలో వీగిపోయింది. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ చట్టం అమలులోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి బ్రేక్ పడింది. అదే సమయంలో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, పెంపు తదితరాలకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లుకు కూడా సభలో ఆమోదం లభించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత శుక్రవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లుకు సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కావడంతో 352 ఓట్లు వస్తేనే బిల్లు నెగ్గాల్సి ఉంది. కానీ సభలో హాజరైన 528 మందిలో అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. అందరూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో 68 ఓట్ల మెజారిటీ తేడా ఉన్నా మూడింట రెండొంతుల బలం లేకపోవడంతో బిల్లులు వీగిపోయాయి. సభలో హాజరైన 528 మందిని పరిగణనలోకి తీసుకుంటే మూడింట రెండొంతుల మెజారిటీగా ఎన్డీఏ కూటమికి 352 ఓట్లు రావాల్సి ఉంది. కానీ కేవలం 298 ఓట్లే రావడంతో 68 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది.

ప్రత్యేక సమావేశాలతో బీజేపీ క్రెడిట్ :

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill), రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం పొందాలని ప్రయత్నించినా ఆ లక్ష్యం నెరవేరలేదు. ఓటింగ్ సమయంలో ప్రధాని కూడా లోక్‌సభలోనే ఉన్నారు. ఈ మూడు బిల్లులపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై 56 మంది మహిళా ఎంపీలు వారివారి అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఈ బిల్లులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, కానీ దాన్ని సాకుగా తీసుకుని డీలిమిటేషన్ బిల్లు పెట్టి దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చే కుట్రకు బీజేపీ తలపడిందని ఆరోపించారు. డీలిమిటేషన్, మహిళా బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ చేపట్టకుండా ఇప్పుడున్న స్థానాల్లోనే మహిళలకు 33% సీట్లను రిజర్వు చేయాలని, ఇప్పటికిప్పుడే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

Read Also: మహిళా బిల్లుతోనైనా ఆ మూడు పార్టీల‌ మనసు మారేనా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>