కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రతి విద్యార్థి వేసవి సెలవులను వృథా చేయకుండా యోగా, ధ్యానం నేర్చుకోవాలని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana) తెలిపారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని హరిచరణ్ పాఠశాలలో ఉచిత ధ్యాన, యోగా (Yoga) శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడారు.
యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక దృఢత్వం కూడా పెరుగుతుందని ఆయన (Dhanpal Suryanarayana) అన్నారు. రోజువారీ జీవితంలో ధ్యానం, సూర్య నమస్కారాన్ని భాగంగా చేసుకోవాలని సూచించారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో యోగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కార్యక్రమంలో పూజ్య శ్రీ స్వామి డాక్టర్ పరమార్థ దేవ్ యోగ శిక్షణ అందించారు. అలాగే కార్యక్రమ అధ్యక్షుడు సాయన్న, పతంజలి యోగ సమితి అధ్యక్షులు బుచ్చన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇంజనీర్ గంగాధర్, యోగరత్న ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షుడు శివుడు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..
Follow Us On: Instagram

