Mobile Popup Ad
Mobile Popup Ad

చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు, ఉద్యోగుల కోసం వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పేర్కొన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

హనుమకొండ (Hanumakonda) కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. వేసవికాలం దృష్ట్యా కలెక్టరేట్ లో ప్రజలు, ఉద్యోగుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చలివేంద్రంలో చల్లని నీటితో పాటు ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో మేన శ్రీను, జిల్లా ఖజానా శాఖ అధికారి ఆకవరం శ్రీనివాస్ కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, అడిషనల్ డీఆర్డీవో లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస స్వామి, టీజీవో నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also: టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>