నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి : ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో :  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal) అధికారులను ఆదేశించారు. నగరంలోని మార్వాడి గల్లీ, మిర్చి కాంపౌంనిజామాబాద్ నగరంలో మంచినీటి పైప్ లైన్ల లీకేజీ పై శాశ్వత పరిష్కారం చేపట్టాలనిడ్ వద్ద లీకైన పైప్ లైన్ ను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా మంచినీటి పైప్ లైన్ లీకేజీకి గురైందని, దీంతో తాగు నీరు కలుషితమై నల్లాల్లోకి వస్తున్నాయన్నారు. మూడు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం తగదన్నారు. ఏళ్లుగా ఉన్న పాత లైన్ ను సర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చేపట్టాలన్నారు. నూతన పైప్ లైన్ వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

మిర్చి కాంపౌండ్ లో చేతిపంపులను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రధానంగా గంజ్ కమాన్ వద్ద గత కొన్ని రోజులుగా నెలకొన్న డ్రైనేజీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఎమ్మెల్యే చెప్పారు. టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్టులో వేయాలన్నారు. వచ్చే మూడు రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్, కార్పొరేషన్ ఏఈ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>