కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ విభాగం ప్రొఫెసర్‌గా ఉన్న నాగమోహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆసుపత్రి పరిపాలనను గాడిన పెట్టేందుకు ఆయన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆకస్మికంగా గాంధీ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ డీఎంఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న జిల్లా ఆసుపత్రి మళ్లీ గాడి తప్పుతుందా.. అనే అభిప్రాయాలు జిల్లా వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

