Mobile Popup Ad
Mobile Popup Ad

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి

కలం, నిజామాబాద్ బ్యూరో: జాతీయ లోక్ అదాలత్ (Lok Adalat) అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ (Nizamabad) జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి కోరారు. ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్ కు సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయంలో న్యాయమూర్తి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. జిల్లాలోని కోర్టుల్లో 11,499 కేసులు పెండింగ్ లో ఉండగా, 3,508 కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునేందుకు అనువైనవిగా గుర్తించామని వెల్లడించారు. తమ కేసులు సత్వరం పరిష్కరించుకోవాలనుకునే కక్షిదారులు ఈ నెల 20వ తేదీలోగా జిల్లా న్యాయ సేవాసంస్థను సంప్రదించి, లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. లోక్ అదాలత్‌కు అందుబాటులో లేని వారు సైతం వాట్సాప్ ద్వారా వీడియో కాన్పరెన్స్ లో సంప్రదించాలని, అలాగే న్యాయసేవా సంస్థను సంప్రదించేందుకు 15100 టోల్ ఫ్రీ నంబర్ ను వినియోగించుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>