Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

కలం, వెబ్ డెస్క్​ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని గన్నారం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఈ బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా గన్నారం సమీపంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>