కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు పండాలని వరుణ యాగం నిర్వహించారు. సోమవారం సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో (Komuravelli Temple) వరుణ యాగం చేశారు. యాగంలో భాగంగా ఆలయ అర్చకులు 108 కళశాలతో ఘటాభిషేకం నిర్వహించారు. ఈ వరుణ యాగంలో ఆలయ ఈవో కట్టా సుధాకర్ రెడ్డి, సిబ్బంది, వీర శైవ ఆగమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

