కలం, వలిగొండ : వలిగొండ (Valigonda) మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన దుకాణాల వారిచే రైతుల కోసం విత్తనమేళ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి అంజని దేవి మాట్లాడుతూ ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటలైన కందులు, పెసర్లు, కూరగాయలు వంటి వాటిని సాగు చేసుకోవాలని వాటిని వివిధ షాపుల్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రఘురామ ఫర్టిలైజర్స్, బాలాజీ ట్రేడర్స్, నరేంద్ర కమిషన్ జనరల్ మర్చంట్, గణేష్ ట్రేడర్స్, శ్రీనివాస ట్రేడర్స్ యజమానులు పాల్గొన్నారు.

