epaper
Monday, March 2, 2026
epaper

బీహార్ సీఎం ఖరారు..

బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్(Nitish Kumar) ఖరారు అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సన్నద్ధం అయింది. తదుపరి ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ను ఎన్‌డీఏ ఖరారు చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌డీఏ(NDA) శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆయనను తమ నాయకుడిగా ఎంపిక చేశారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పరచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అయితే ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ఘటన విజయం సాధించింది. ఈ ఎన్నికలో మొత్తం 243 స్థానాల్లో ఎన్‌డీఏ 202 స్థానాలను సొంతం చేసుకుంది. ఈ ఎన్నికలో బీజేపీ 89, జేడీయూ, ఎల్‌జేపీ(ఆర్‌వీ) 19, హెచ్‌ఏఎంఎస్ 5, ఆర్ఎల్‌ఎం 4 సీట్లు గెలిచారు.

బుధవారం ఉదయం ఆపద్ధర్మ సీఎం నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే పార్టీ సమావేశంలో, నితీశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా శాసనసభా పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇదే సమయంలో, బీజేపీ శాసనసభా పార్టీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీని శాసనసభా పార్టీ నాయకుడిగా, విజయ్ కుమార్ సింహాను ఉప నాయకుడిగా ఎన్నుకున్నారు.

నితీశ్ కుమార్(Nitish Kumar) రేపు పదో సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఉదయం 11:30 గంటలకు పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు అనేక ప్రముఖులు హాజరుకానున్నారు.

Read Also: ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న బంగ్లాదేశ్‌

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!