72వ వన్యప్రాణి వారోత్సవాలు: నిర్మల్‌లో అటవీ శాఖ బైక్ ర్యాలీ

కలం, నిర్మల్ : 72వ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అటవీశాఖ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు కొనసాగింది. నిర్మల్ అటవీ మండలాధికారి నాగిని భాను మాట్లాడుతూ.. ప్రతి ఏడాది అక్టోబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీ ద్వారా వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. వన్యప్రాణుల ఆవాసాలను కాపాడటం, ప్రకృతి సమతుల్యతను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓలు రామకృష్ణ, శ్రీనివాసరావు, రాథోడ్ రమేష్, డీఆర్‌ఓ నజీర్ ఖాన్‌, వివిధ అటవీ డివిజన్ల సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>