ప్రజావాణి ఫిర్యాదులపై ఎస్పీ కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: బాధితుల సమస్యలను సత్వరంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజావాణి లక్ష్యమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి వినతులను ఓపికగా విని స్వీకరించాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>