పూర్వ విద్యార్థుల ఔదార్యం.. శిశు మందిర్ పాఠశాల అభివృద్ధికి భారీ విరాళం

కలం, నిర్మల్: చదువు నేర్పిన పాఠశాలపై మమకారం చాటుకున్నారు 2007 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని బాగులవాడ శ్రీ సరస్వతీ శిశు మందిర్ (Saraswathi Shishu Mandir) పాఠశాల పునర్వైభవం, అభ్యున్నతికి తమవంతు సహకారం అందిస్తూ రూ. 1,01,116 ఆర్థిక సహాయాన్ని శనివారం అందించారు. తమ బాల్య విద్యకు బాటలు వేసిన పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులు ఈ విరాళాన్ని అందించడం అభినందనీయమని పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు అన్నారు.

ఈ కార్యక్రమంలో రావుల సూర్యనారాయణ, డాక్టర్ కూన ప్రవీణ్, నూకల విజయ్ కుమార్, శ్రీనివాస్ సాత్పుతె, అయిట్ల ప్రవీణ్, అల్లం భాస్కర్, పూర్వ విద్యార్థులు సిద్ధార్థ, విజయ్ రాజ్, ప్రశాంత్, నగేష్, వామన్ వర్మ, జాదవ్ సాయి కుమార్, శివ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>