కలం, నిర్మల్: ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సోమవారం నిర్మల్ జిల్లా (Nirmal) దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ (Cordon Search) నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 81 ద్విచక్ర వాహనాలు, 6 కార్లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు.
అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కృష్ణ, ఎస్ఐలు రవీందర్, లింబాద్రి, గణేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

