వీబీ జీ రామ్ జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : వీబీ జీ రామ్ జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) అన్నారు. శుక్రవారం లోకేశ్వరం మండలం అర్లి, గొడిసెర గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వీబీ జీ రామ్ జీ కింద గ్రామంలో ప్రతి ఒక్కరు ఉపాధి పొందాలని పేర్కొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు జాబ్ కార్డులు కలిగి ఉన్న వారిని కూలి పనులకు వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. వీబీ జీ రామ్ జీ కార్యక్రమం కింద విస్తృతంగా నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. నీటి సంరక్షణ చర్యల వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు.

గ్రామంలో స్వాధ్యాయి వృక్ష మందిరానికి స్థలం కేటాయింపు అంశంపై కలెక్టర్ భవేశ్ మిశ్రా స్థానికులతో మాట్లాడారు. వృక్ష మందిరం కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లీజు, ఇతర మార్గాల ద్వారా వృక్షాలు నాటేందుకు స్థలాన్ని కేటాయించే అంశంపై అధికారులకు సూచనలు చేశారు. సంబంధిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. సదరు ప్రాంతంలో గ్రావెల్, స్టోన్ మెటీరియల్ ఉన్నదేమో తెలుసుకునేందుకు మైనింగ్ అధికారుల ద్వారా వివరాలు సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సూర్యారావు, సర్పంచ్ జంగం ప్రసన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>