భవిత కేంద్రంలో క్రీడా సంబరాలు!

కలం, యాదగిరిగుట్ట: శారీరక, మానసిక సవాళ్లు వారి ప్రతిభకు అడ్డుకాదని ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు నిరూపించారు. సాధారణ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభను చాటుకున్నారు. యాదగిరిగుట్ట (Yadagirigutta)లోని MPPS మెయిన్ రోడ్ పాఠశాల ఆవరణలో ఉన్న భవిత కేంద్రం వేదికగా నిర్వహించిన మండలస్థాయి క్రీడా పోటీలు చిన్నారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రన్నింగ్, స్పీడ్ వాక్, మ్యూజికల్ చైర్, డ్రాయింగ్ పోటీల్లో విద్యార్థులు తమదైన శైలిలో ప్రతిభ కనబరిచారు. ప్రతి పోటీలోనూ పాల్గొనాలనే తపన, విజయం సాధించాలనే పట్టుదల కనిపించాయి. విజేతలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా MEO కె. శరత్ యుమిని, IE కోఆర్డినేటర్ పెసరు లింగారెడ్డి మాట్లాడుతూ.. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో విద్యా, సామాజిక, వ్యక్తిగత అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని వివరించారు. తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చకుండా వారిలోని ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని.. అవకాశం, ప్రోత్సాహం లభిస్తే ప్రతి చిన్నారిలోనూ విజేత దాగి ఉంటాడని ఈ క్రీడా పోటీలు చాటిచెప్పాయి. చిన్నారుల చిరునవ్వులు, వారి విజయోత్సాహం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో MPPS యాదగిరిగుట్ట PSHM రమాదేవి, మల్లాపూర్ PSHM కొండల్ రెడ్డి, ZPHS బాలుర P.D. సుజాత, ZPHS బాలికల SA ఎం. నిర్మల, స్పెషల్ ఎడ్యుకేటర్ కె. యమున, IERP కె. రాణి, MRC సిబ్బంది భాస్కర్, రమాదేవి, బిక్షపతి, సంగీత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>