KNRUHS కీలక నిర్ణయం.. MBBS దరఖాస్తులకు మరో అవకాశం!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) వైద్య విద్యార్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు విశ్వవిద్యాలయం ఈ అవకాశాన్ని కల్పించింది.

ఈ మేరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధిత పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. NEET UG 2026 లో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించి అర్హత పొందిన అభ్యర్థులు తమ ధృవపత్రాలను ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు. నమోదు ప్రక్రియ ఆగస్టు 18 మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఆగస్టు 20 సాయంత్రం 6:00 గంటల వరకు కొనసాగుతుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tsmedadm.tsche.in ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. ఇతర వివరాలు, మార్గదర్శకాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్‌ను పరిశీలించవలసిందిగా అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>