నిర్మల్‌లో గణేష్ నిమజ్జన సందడి.. పోటెత్తిన భక్తజనం

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర (Nirmal Ganesh Immersion) కన్నులపండువగా సాగింది. నిమజ్జన వేడుకలను తిలకించేందుకు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పాత బస్టాండ్‌ నుంచి వివేక్‌ చౌక్‌, జయశంకర్‌ చౌరస్తా, నగరేశ్వరవాడ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వివిధ కాలనీల నుంచి తరలివచ్చిన గణనాథులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

నిమజ్జనానికి తరలుతున్న గణపయ్యలను చూసేందుకు చిన్నారులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలుచోట్ల యువత డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. నగరేశ్వరవాడ చౌరస్తాలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద నిమజ్జనానికి తరలివచ్చిన గణనాథులకు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. భక్తుల రాకతో ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>