కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి

కలం, వెబ్ డెస్క్ : కాంగోలో ఘోర విమాన ప్రమాదం (Congo Plane Crash) చోటు చేసుకుంది. నైరుతి నగరమైన కిక్విట్ నుండి రాజధాని కిన్షాసాకు తిరిగి వస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మరణించారు. మృతుల్లో దేశ సైనిక న్యాయస్థానానికి అధిపతిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ముటొంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ అయిన లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సాంకేతిక లోపం కారణంగా విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదానికి గల కారణాలపై కాంగో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>