నాటుసారా తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామ శివారులో రూట్‌ వాచ్‌ నిర్వహించి 20 లీటర్ల నాటుసారా (Illicit Liquor Seize)  స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ భిక్షపతి తెలిపారు. వెంకటాపూర్‌ తండాకు చెందిన భూక్యా సాయిబాబా, గుగ్లావత్‌ గణేశ్‌ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా నాటుసారాను తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి, మామడ తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు వివరించారు.

దసరా పండుగ నేపథ్యంలో నాటుసారా తయారీ కేంద్రాలు, రవాణాపై నిఘా పెంచినట్లు సీఐ తెలిపారు. నాటుసారాను తయారు చేసినా, విక్రయించినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, పట్టిక వంటి ముడి పదార్థాలను అక్రమంగా రవాణా చేసినా, నిల్వ చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>