కలం, అచ్చంపేట: భూ క్రయ,విక్రయాల విషయంలో రైతులు ప్రభుత్వంకు చలానా రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని(Land Registration) తహసిల్దార్ కార్యాలయంకు వస్తే తీరా అక్కడ చూస్తే కరెంట్ లేదని, తహసిల్దార్ లేరని అంటూ రోజులు రోజులు గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇలా రైతులు అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ కాకపోవడం వలన మళ్లీ పంచాయతీలు పెట్టి ఇచ్చిన గడువులో చేయించుకోలేదని ఎక్కువ డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు.
దీనికి తోడు తహసిల్దార్ కార్యాలయంలో ఆపరేటర్‌తో పోటోలు దింపి ..ఆపరేషన్ అంతా తన స్వగృహంలో లాప్ టాప్ తో రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రజలకి అందని ద్రాక్షగా మారారు. అదే దారిలో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ లోలోపల లోపాయికారి ఒప్పందంతో చేతులు తడుపుతున్న పైల్స్ మాత్రమే ముందుకు సాగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే అచ్చంపేట తాసిల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రెజరీలో సీనియర్ అసిస్టెంట్ అధికారి ఏసీబీ వలలో చిక్కిన విషయం పాఠకులకు వివిధమే అయినప్పటికీ పక్కనే ఉన్న తాసిల్దార్ కార్యాలయంలో పైసలిస్తే తప్ప పని కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతు ఎండి హాజీ పాష మాట్లాడుతూ ..అచ్చంపేట నేను స్లాట్ బుక్ చేసుకొని గత కొన్ని రోజుల నుంచి తాసిల్దార్ కార్యం చుట్టూ తిరుగుతున్నాను . కార్యాలయంలో తాసిల్దారు ఉండడు సాయంత్రం వచ్చేసరికి కరెంటు ఉండదు రిజిస్ట్రేషన్ కాక చాలా ఇబ్బంది గురవుతున్నాను. అన్ని ఉంటే ఏదో ఒక సాకు చెప్పి రిజిస్ట్రేషన్ నిలిపేస్తున్నారు. పైసలు ఇస్తే తప్ప పని అవడం లేదు అని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

