కలం, నిర్మల్: చాకలి ఐలమ్మ (Chakali Ilamma) పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్ (Rathod Ramesh) అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ (Nirmal Collectorate) సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర, ఆమె పోరాట స్ఫూర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. నాటి కాలంలో రజాకారులు, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని పేర్కొన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనతో పాటు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శంకర్, కార్మిక శాఖ అధికారి రాజలింగు, సహాయ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, కుల సంఘాల నాయకులు సుంకెట పోశెట్టి, గజ్జారాం, గంగాధర్, మస్కాపురం పోశెట్టి, రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

