ట్రాన్స్‌కో ప్రైవేటీకరణకు కాంగ్రెస్ కుట్ర: మాజీ మంత్రి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లాభాల్లో నడుస్తున్న ట్రాన్స్‌కో సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మిత్రులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు ఎలాంటి నష్టాలు లేని ట్రాన్స్‌కోను ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించినా మంచి ఫలితాలు రాలేదని, ప్రైవేట్ యాజమాన్యాలు కేవలం స్వలాభం కోసమే పనిచేస్తాయి తప్ప ప్రజల సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోవని స్పష్టం చేశారు. ట్రాన్స్‌కోను తక్కువ ధరకే తన అనుకూల వ్యక్తులకు కట్టబెట్టే ఈ చర్యను బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొొన్నారు.

అదేవిధంగా సింగరేణి సంస్థ విషయంలోనూ రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో జీ9 రకం బొగ్గు లేదనడం పూర్తిగా వాస్తవ దూరమని, ప్రస్తుతం కూడా 13 గనుల్లో జీ9 బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును రికార్డుల్లో చూపించకుండా అక్రమంగా విక్రయించుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇక్కడి నాణ్యమైన జీ9 బొగ్గును సీఎం తన గురువు చంద్రబాబు నాయుడు, మిత్రుడు శివకుమార్‌లకు సప్లై చేస్తూ, తెలంగాణలో మాత్రం నాసిరకం బొగ్గును ఉపయోగిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>