పుష్కరాల పనులపై కలెక్టర్లతో దేవాదాయ శాఖ సమీక్ష

కలం, నిర్మల్: గోదావరి పుష్కరాల పనులన్నింటినీ (Godavari Pushkaralu Works) నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి హైదరాబాద్ నుంచి పలు జిల్లాల కలెక్టర్లతో పుష్కరాల పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ పుష్కరాల పనులను కలెక్టర్లు, నోడల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పుష్కరాలకు అవసరమైన భూసేకరణకు చర్యలు తీసుకోవాలని, పనుల పూర్తికి నిర్దిష్ట గడువు నిర్ణయించి అందులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు.నిర్మాణ పనులకు ఇసుక కొరత తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పుష్కరాల పనులపై పలు కీలక సూచనలు చేశారు.

నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) మాట్లాడుతూ బాసరతో పాటు జిల్లాలో పుష్కరాలు జరిగే అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా పనులు చేపడుతున్నట్లు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో పనులను గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. పనులను నాణ్యవంతంగా చేపట్టడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>