మిస్ ఎర్త్ వాటర్ ఆఫ్ ఇండియా-2026 ప్రీతి ముండేకు సన్మానం

కలం, ఉట్నూర్: ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌కు చెందిన ప్రీతి ముండే (Preethi Munde) మిస్ ఎర్త్ వాటర్ ఆఫ్ ఇండియా-2026గా గుర్తింపు పొందిన సందర్భంగా ఆమె విద్యాభ్యాసం చేసిన ఉట్నూర్‌లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ హాజరై ప్రీతి ముండేను సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించి ప్రీతి ముండే ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారని అన్నారు. విద్యార్థులు ఆమె విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటాలని సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రీతి ముండే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకుని మరింతగా రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>